Posts

Showing posts from February, 2025

సముద్రం లో షార్క్ లు మధ్యన హోటల్ ..ఎక్కడ ఉందొ తెలుసా ?

Image
  ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్ ప్రపంచంలో ఎన్నో అందమైన హోటల్స్తో పాటు అత్యంత ప్రమాదకరమైన హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ అంత ప్రమాదకరమైన హోటల్ ఎక్కడ ఉంది? అసలు ఎందుకు ఈ హోటల్ ప్రమాదకరంగా మారింది? పూర్తి వివరాలు ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం. నార్త్ కరోలినా తీరానికి 34 మైళ్ల దూరంలో ఫ్రైయింగ్ పాన్ టవర్ అనే ఓ హోటల్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్. అయితే ఈ హోటల్కి చేరుకోవాలంటే పడవలో వెళ్లడానికి కూడా అవకాశం లేదు. కేవలం విమానంలో మాత్రమే ఈ హోటల్కి చేరుకోవాలి. బీచ్ మధ్యలో ఉండే ఈ హోటల్ ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. ఎంతో అందంగా ఉండే ఈ ప్లేస్లో చాలా తినడానికి వెళ్తుంటారు. కానీ కాస్త భయంతోనే ఉంటారు. ఎందుకంటే సముద్రంలో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే మాత్రం ఇక పైకే. ఇక్కడ ఎన్నో ప్రమాదకరమైన జీవులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సొరచేపలు అధికంగా ఉన్నాయి. ఈ ఫ్రైయింగ్ పాన్ టవర్ అనేది ఒకప్పుడు కోస్ట్ గార్డ్ లైట్ స్టేషన్గా పనిచేసింది. అయితే ఇప్పుడు ఇది హోటల్గా మారింది. ఇక్కడికి ఎక్కువగా సాహస ప్రియులు వెళ్తుంటారు. ఈ టవర్లో ఉంటే మాత్రమే సముద్ర అందాలను వీక్షించవచ్చు. ఎంతో సుందరంగా ఉం...

సముద్రం లో షార్క్ లు మధ్యన హోటల్ ..ఎక్కడ ఉందొ తెలుసా ?

Image
  ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్ ప్రపంచంలో ఎన్నో అందమైన హోటల్స్తో పాటు అత్యంత ప్రమాదకరమైన హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ అంత ప్రమాదకరమైన హోటల్ ఎక్కడ ఉంది? అసలు ఎందుకు ఈ హోటల్ ప్రమాదకరంగా మారింది? పూర్తి వివరాలు ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం. నార్త్ కరోలినా తీరానికి 34 మైళ్ల దూరంలో ఫ్రైయింగ్ పాన్ టవర్ అనే ఓ హోటల్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్. అయితే ఈ హోటల్కి చేరుకోవాలంటే పడవలో వెళ్లడానికి కూడా అవకాశం లేదు. కేవలం విమానంలో మాత్రమే ఈ హోటల్కి చేరుకోవాలి. బీచ్ మధ్యలో ఉండే ఈ హోటల్ ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. ఎంతో అందంగా ఉండే ఈ ప్లేస్లో చాలా తినడానికి వెళ్తుంటారు. కానీ కాస్త భయంతోనే ఉంటారు. ఎందుకంటే సముద్రంలో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే మాత్రం ఇక పైకే. ఇక్కడ ఎన్నో ప్రమాదకరమైన జీవులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సొరచేపలు అధికంగా ఉన్నాయి. ఈ ఫ్రైయింగ్ పాన్ టవర్ అనేది ఒకప్పుడు కోస్ట్ గార్డ్ లైట్ స్టేషన్గా పనిచేసింది. అయితే ఇప్పుడు ఇది హోటల్గా మారింది. ఇక్కడికి ఎక్కువగా సాహస ప్రియులు వెళ్తుంటారు. ఈ టవర్లో ఉంటే మాత్రమే సముద్ర అందాలను వీక్షించవచ్చు. ఎంతో సుందరంగా ఉం...

కాలువలో భారీ కొండచిలువ: ప్రాణాలకు తెగించి లాగేసిన యువకుడు

  కాలువలో భారీ కొండచిలువ: ప్రాణాలకు తెగించి లాగేసిన యువకుడు చాలామందికి పాములు, కొండచిలువలు అంటే భయం. కానీ కొందరు మాత్రం ఎంత పెద్ద పాము కళ్లెదురుగా వచ్చినా కూడా ఏ మాత్రం కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలువలోంచి ఒక భారీ కొండచిలువను ఒక వ్యక్తి ఒంటరిగా బయటకు లాగుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీడియోలో, ఆ వ్యక్తి నీళ్లలో సగం ఉన్న కొండచిలువ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. పాము కాస్త కోపంగా, దూకుడుగా తిరుగుతుంటుంది. అతను మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఒక చిన్న వంతెన లాంటి దానిపై నిలబడ్డాడు. చాలా జాగ్రత్తగా నీళ్లలో ఉన్న కొండచిలువను పట్టుకుని బయటకు లాగడం మొదలుపెట్టాడు. ఆ పాము అతన్ని కాటేయడానికి ప్రయత్నించినా, అతను చాలా తేలికగా తప్పించుకున్నాడు. నిదానంగా ఆ భారీ పామును కాలువలోంచి పైకి లేపాడు. అతని ధైర్యం, ఆ పామును హ్యాండిల్ చేసిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.   'విశాల్ స్నేక్ సేవర్' అనే ఇన్స్టా యూజర్ ఈ వీడియోను షేర్ చేయగా, ఇప్పటికే 3.6 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ వ్యక్తి ధైర్యానికి, ప్రమాదకరమైన పరిస్థితిని ...

ఇండియన్స్ కోసం ప్రత్యేక విమానం : వోట్ వేసిన పాపానికి భారతీయులను తరిమేస్తున్న ట్రంప్

 అమెరికాలో భారతీయ వలసదారులు: ట్రంప్ పరిపాలన యొక్క ప్రభావం ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. ట్రంప్ పరిపాలన యొక్క కఠిన ఆంక్షల కారణంగా చాలా మంది భారతీయులు అమెరికాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా వేలాది మందిని అక్రమ వలసదారులుగా పరిగణించి వెనక్కి పంపించేస్తున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ షురూ అయ్యింది. అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించి అధికారులు ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్ కు బయలుదేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించినట్లు వార్తా ఏజెన్సీ రాయిటర్స్ సంస్థ పేర్కొంది. సీ 17 ఎయిర్ క్రాఫ్ట్ లో వలసదారులను తరలిస్తున్నట్లు సమాచారం. భారత్ కు చేరుకునేందుకు 24 గంటల సమయం పడుతుందని అంచనా. అయితే ఎంత మంది వలసదారులను తరలిస్తున్నారన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ట్రంప్ మొదటి నుంచి కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ బాధ్యత...

అక్కడ కుంబ మేళ ... ఇక్కడ కొబ్బరి కాయలు గిరాకీ ... ఇంతకు ఏమయింది ?

 అక్కడ కుంబ మేళ ... ఇక్కడ కొబ్బరి కాయలు గిరాకీ ... ఇంతకు ఏమయింది ?అక్కడ కుంబ మేళ ... ఇక్కడ కొబ్బరి కాయలు గిరాకీ ... ఇంతకు ఏమయింది ? కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించి, నదికి కురిడి కొబ్బరి సమర్పించడం సాంప్రదాయం. దీనితో కుంభమేళాకి కోనసీమ నుంచి కురిడి కొబ్బరి ఎగుమతులు భారీగా పెరిగాయి. దాదాపు రెండు లక్షలు కురిడి కొబ్బరికాయలు ఈ ప్రాంతం నుంచి తరలిస్తున్నారు. ధర కూడా గతంలో ఎప్పుడు లేనివిధంగా భారీగా పెరిగింది. ఒక్కొక్క కురిడి కొబ్బరికాయ 20 నుంచి 25 రూపాయల వరకు పలుకుతుంది. కొబ్బరి రైతుల చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు .కోనసీమ పరిసర ప్రాంతాల నుంచి 100 కొబ్బరికాయలు బయటకు వెళ్తుంటే అందులో వాటర్ కోకోనట్స్ 20 మాత్రమే ఉంటున్నాయి. మిగతా 80 కూడా కురిడి కొబ్బరి ఉంటున్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా కొబ్బరి దిగుబడి ఈ ఏడాది తగ్గడం కోనసీమ రైతులకు కలిసొచ్చింది. దానివలన అనూహ్యమైన ధర పలుకుతుంది. కురిడీలో గండేర రకానికి డిమాండ్ మరింత ఎక్కువ ఉందని రైతులు చెప్తున్నారు. కురిడీకి వచ్చిన అనూహ్యమైన ధరతో రైతులు, వ్యాపారులు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్లు, కూలీలకు చేతినిండా పని దొరుకుతుంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఇదే పరిస్థితి...

కాకినాడ మత్స్యకారులు వలలో కచిడి చేప @ ₹3.95 లక్షలు: కుట్లు, సౌందర్య సాధనాల్లో ఉపయోగం

 కచిడి చేప: కాకినాడలో అదృష్టం పండిన వేళ! కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు అదృష్టం వరించింది. వేటకు వెళ్లిన వారికి అరుదైన కచిడి చేప లభించడంతో ఒక్కసారిగా వారి జీవితాలు మారిపోయాయి. ఈ చేప వేలంలో భారీ ధరకు అమ్ముడుపోవడంతో వారు కాసుల పంట పండించారు. ఇంతకీ ఈ కచిడి చేప ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కచిడి చేప - ఓ అద్భుత సంపద: ఈ చేప పేరు కచిడి చేప, దీని శాస్త్రీయ నామం ప్రోటోనిబియా డయాకాన్తస్ (Protonibea diacanthus). ఇది చాలా అరుదుగా దొరికే చేప. ఈ చేపకు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా భారీ డిమాండ్ ఉంది. కాకినాడలో దొరికిన ఈ చేప 25 కిలోల బరువుంది. దీనిని వేలం వేయగా రికార్డు స్థాయిలో రూ. 3.95 లక్షలు పలికింది. అంటే కిలో చేప దాదాపు రూ. 15,800లకు అమ్ముడుపోయింది. కచిడి చేప ఉపయోగాలు: ఈ చేప కేవలం రుచికి మాత్రమే కాదు, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కుట్లు వేయడానికి దారం: ఈ చేప పొట్ట భాగం నుండి తీసిన పదార్థాన్ని కుట్లు వేయడానికి అవసరమైన దారాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సౌందర్య సాధనాలు: ఈ చేపను సౌందర్య సాధనాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. వైన్ శుభ్రం చేయడానికి: ఖరీదైన వైన్ లను శుభ్రం చేయడానికి ఈ చేప ...

77 ఏళ్ల తర్వాత నీలబందలో విద్యుత్ వెలుగులు : ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రామం ఉంది మీకు తెలుసా!

 అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం, అర్ల పంచాయతీలోని నీలబంద గ్రామంలో విద్యుత్ వెలుగులు లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు అయినా, ఈ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేదు. దీంతో ప్రజలు చీకట్లోనే జీవనం సాగించారు. ఎట్టకేలకు, నీలబంద గ్రామంలో విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గ్రామంలో మొదటిసారిగా విద్యుత్ వెలుగులు రావడంతో ప్రజలు ఎంతో సంతోషించారు. ఈ ఆనంద క్షణాల్లో, గ్రామస్తులు థింసా నృత్యం చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నీలబంద గ్రామంలో 3 కుటుంబాలు మరియు 26 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం రావడం నిజంగా గొప్ప విషయం.

సెలైన్‌తో చికిత్స పొందుతూ, రోగులకు చికిత్స అందించిన డాక్టర్!

Image
 డాక్టర్ బ్రజరాజ్ కర్ చేతికి సెలైన్ పెట్టించుకుని రోగులకు చికిత్స అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆయన సేవాభావాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. తమ ఆరోగ్యం బాగోలేకపోయినా, ఇతరుల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం నిజంగా ఒక గొప్ప గుణం. ఆయన నిర్విరామ సేవను చూసి చాలా మంది ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

సముద్రపు రాళ్ళు: తీసుకెళ్లడం ప్రమాదకరం

  సముద్ర తీరంలో రాళ్ళు ఎందుకు ఎంచుకోకూడదు సముద్ర తీరానికి వెళ్లడం చాలా సరదాగా ఉంటుంది. మీరు ఇసుకలో ఆడవచ్చు, సూర్యుడిని ఆస్వాదించవచ్చు మరియు సముద్రాన్ని చూడవచ్చు. మీరు చేయకూడని ఒక విషయం ఏమిటంటే, రాళ్ళు ఎంచుకోవడం. సముద్ర తీరంలో రాళ్ళు ఎంచుకోవడం హానికరమైనది ఎందుకంటే ఇది తీరానికి రక్షణను తగ్గిస్తుంది. రాళ్ళు అలల శక్తిని గ్రహించడం ద్వారా తీరాన్ని కోత నుండి రక్షిస్తాయి. మీరు రాళ్ళు ఎంచుకున్నప్పుడు, మీరు తీరం కోతకు గురికాకుండా చేస్తారు. ఇంకా, రాళ్ళు తరచుగా చిన్న మొక్కలు మరియు జంతువులకు ఇల్లు. మీరు రాళ్ళు ఎంచుకున్నప్పుడు, మీరు ఈ జీవుల ఆవాసాన్ని నాశనం చేస్తున్నారు. సముద్ర తీరంలో రాళ్ళు ఎంచుకోవడం చట్టవిరుద్ధం అని మీకు తెలుసా? కొన్ని ప్రదేశాలలో, రాళ్ళు ఎంచుకోవడం నేరం, మరియు మీరు జరిమానా విధించబడవచ్చు. కాబట్టి, తదుపరిసారి మీరు సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు, రాళ్ళు ఎంచుకోవద్దు. బదులుగా, మీరు సముద్రం యొక్క అందాన్ని ఆస్వాదించవచ్చు మరియు మీతో కొన్ని జ్ఞాపకాలను ఇంటికి తీసుకువెళ్లవచ్చు. మీరు సముద్ర తీరంలో రాళ్ళు ఎందుకు ఎంచుకోకూడదో ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి రాళ్ళు తీరానికి రక్షణను తగ్గిస్తాయి. రాళ...

ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ హీరోగా 8 సినిమాలు!

ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్‌లో ట్రావెలర్ వీడియోలు చూసే ప్రతి ఒక్కరికీ అతను తెలుసు. ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ అక్కడి విశేషాలని తన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆసక్తికరంగా పంచుకుంటూ ఉంటాడు. అందుకే నా అన్వేష్ కి మిలియన్స్‌లో ఫాలోవర్స్ ఉన్నారు. అతను యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. ఇండియాలో అత్యధికంగా సంపాదిస్తున్న యూట్యూబర్‌గా నా అన్వేష్ ఉన్నాడు. అతను ఏ దేశం వెళ్లినా అక్కడి అమ్మాయిలతో సరదాగా మూవ్ అవుతూ వారిని తనతో పాటు దేశం మొత్తం తిప్పుతాడు. ఇక నా అన్వేష్ వీడియోలు సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. అతని మాటలు, సెటైర్స్, కామెడీ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా నా అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేశాడు. 8 నెలల్లో 8 సినిమాలు నేను హీరోగా రిలీజ్ చేయబోతున్నాను. ఏఐ ఉపయోగించి ఈ సినిమాలు తెరకెక్కించబోతున్నాం. అందరి హీరోల పేర్లకి ముందు స్టార్ అని ఉన్నట్లే నన్ను కూడా ఏదో ఒక స్టార్ తగిలించుకోమని ప్రొడ్యూసర్స్ చెప్పారు. అయితే ఏ స్టార్ పెట్టుకోవాలో నాకు తెలియడం లేదు. మీరు సజెస్ట్ చేస్తే అ...

మరణశిక్ష తర్వాత పెన్ మొన ఎందుకు విరిచేస్తారు?

 సాధారణంగా కోర్టులలో ఉరి శిక్ష తీర్పు ఇచ్చాక జడ్జ్ పెన్ నిబ్ ను విరిచి వేస్తారు. అలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా.. వివరాల్లోకి వెళితే ఏ నేరం చేస్తే ఎలాంటి శిక్ష విధించాలి. ఎన్ని రోజులకు ఖైదు ప్రకటించాలనేది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు అది బీఎన్‌ఎస్‌గా మారింది. ఇక నేరం నిరూపితమైన తర్వాత కఠిన కారాగారానికి బదులు, సామాజిక శిక్ష విధించవచ్చనే మార్గదర్శకాలు ప్రస్తుతం లేవు. కొన్ని సందర్భాల్లో మాత్రమే కోర్టులు ఈ తరహా తీర్పులను వెలువరిస్తాయి. ఇతరులకు హాని కలిగించేటువంటి ఏ పని అయినా నేరం కిందకే వస్తుందని మనం గుర్తుంచుకోవాలి. ఇందులో ఒక్కొక్క నేరానికి ఒక్కోక్క శిక్ష ఉంటుంది. కొంత మందికి జైలు శిక్ష పడుతుంది. ఇందులో కొంత మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఇంకొంతమంది చేసిన నేరాలకు ఏ శిక్ష ఐనా తక్కువే అనిపిస్తుంది. అలాంటి ఘోరమైన...తప్పు చేసినప్పుడు విధించేదే మరణశిక్ష. ఈ శిక్ష అనేది క్షమించరాని నేరం చేసినవారికి మాత్రమే విధిస్తారు. మనం చాలా సినిమాల్లో మరణశిక్ష విధించే సీన్లను చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో ఒక విషయాన్ని మనం గమనించి ఉండాలి. మరణ శిక్ష తీర్పు ఇచ్చిన తర్వాత జడ్జి ...

ఒకే స్తంభంపై నాలుగు రైళ్లు!

  చెన్నై మెట్రో రైల్వే సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒకే స్తంభంపై ఐదు డబుల్ లేయర్డ్ మెట్రో రైలు పట్టాలను నిర్మించనుంది. ఈ వినూత్న విధానం ద్వారా రూ.5వేల కోట్లను ఆదా అవుతాయని చెప్పారు. ఐదు ట్రాక్ ల బరువు తట్టుకునేలా భూమిలో గట్టి పునాది వేస్తున్నామని, వడపళని నుండి పోరూరు వరకు ఉన్న 4 కిలోమీటర్ల మేర ఐదు ట్రాక్లను డబుల్ లేయర్లలో నిర్మిస్తామని, రెండంతస్థుల్లో దిగువ అంతస్థులో రెండు ట్రాక్ పై, పై అంతస్థులో మరో రెండు ట్రాక్లను నిర్మించి, వాటి పక్కనే మరో లూప్లాన్ ట్రాక్ కూడా నిర్మించనున్నామని చెప్పారు. దీనితో నాలుగు రైళ్లను ఒకే స్తంభంపై నడపటానికి వీలు కలుగుతుందన్నారు. రైళ్ల ట్రాక్ ను మార్చడానికి లూప్లాన్ సాయపడుతుందన్నారు.