Posts

సముద్రం లో షార్క్ లు మధ్యన హోటల్ ..ఎక్కడ ఉందొ తెలుసా ?

Image
  ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్ ప్రపంచంలో ఎన్నో అందమైన హోటల్స్తో పాటు అత్యంత ప్రమాదకరమైన హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ అంత ప్రమాదకరమైన హోటల్ ఎక్కడ ఉంది? అసలు ఎందుకు ఈ హోటల్ ప్రమాదకరంగా మారింది? పూర్తి వివరాలు ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం. నార్త్ కరోలినా తీరానికి 34 మైళ్ల దూరంలో ఫ్రైయింగ్ పాన్ టవర్ అనే ఓ హోటల్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్. అయితే ఈ హోటల్కి చేరుకోవాలంటే పడవలో వెళ్లడానికి కూడా అవకాశం లేదు. కేవలం విమానంలో మాత్రమే ఈ హోటల్కి చేరుకోవాలి. బీచ్ మధ్యలో ఉండే ఈ హోటల్ ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. ఎంతో అందంగా ఉండే ఈ ప్లేస్లో చాలా తినడానికి వెళ్తుంటారు. కానీ కాస్త భయంతోనే ఉంటారు. ఎందుకంటే సముద్రంలో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే మాత్రం ఇక పైకే. ఇక్కడ ఎన్నో ప్రమాదకరమైన జీవులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సొరచేపలు అధికంగా ఉన్నాయి. ఈ ఫ్రైయింగ్ పాన్ టవర్ అనేది ఒకప్పుడు కోస్ట్ గార్డ్ లైట్ స్టేషన్గా పనిచేసింది. అయితే ఇప్పుడు ఇది హోటల్గా మారింది. ఇక్కడికి ఎక్కువగా సాహస ప్రియులు వెళ్తుంటారు. ఈ టవర్లో ఉంటే మాత్రమే సముద్ర అందాలను వీక్షించవచ్చు. ఎంతో సుందరంగా ఉం...

కాలువలో భారీ కొండచిలువ: ప్రాణాలకు తెగించి లాగేసిన యువకుడు

  కాలువలో భారీ కొండచిలువ: ప్రాణాలకు తెగించి లాగేసిన యువకుడు చాలామందికి పాములు, కొండచిలువలు అంటే భయం. కానీ కొందరు మాత్రం ఎంత పెద్ద పాము కళ్లెదురుగా వచ్చినా కూడా ఏ మాత్రం కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలువలోంచి ఒక భారీ కొండచిలువను ఒక వ్యక్తి ఒంటరిగా బయటకు లాగుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీడియోలో, ఆ వ్యక్తి నీళ్లలో సగం ఉన్న కొండచిలువ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. పాము కాస్త కోపంగా, దూకుడుగా తిరుగుతుంటుంది. అతను మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఒక చిన్న వంతెన లాంటి దానిపై నిలబడ్డాడు. చాలా జాగ్రత్తగా నీళ్లలో ఉన్న కొండచిలువను పట్టుకుని బయటకు లాగడం మొదలుపెట్టాడు. ఆ పాము అతన్ని కాటేయడానికి ప్రయత్నించినా, అతను చాలా తేలికగా తప్పించుకున్నాడు. నిదానంగా ఆ భారీ పామును కాలువలోంచి పైకి లేపాడు. అతని ధైర్యం, ఆ పామును హ్యాండిల్ చేసిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.   'విశాల్ స్నేక్ సేవర్' అనే ఇన్స్టా యూజర్ ఈ వీడియోను షేర్ చేయగా, ఇప్పటికే 3.6 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ వ్యక్తి ధైర్యానికి, ప్రమాదకరమైన పరిస్థితిని ...

ఇండియన్స్ కోసం ప్రత్యేక విమానం : వోట్ వేసిన పాపానికి భారతీయులను తరిమేస్తున్న ట్రంప్

 అమెరికాలో భారతీయ వలసదారులు: ట్రంప్ పరిపాలన యొక్క ప్రభావం ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. ట్రంప్ పరిపాలన యొక్క కఠిన ఆంక్షల కారణంగా చాలా మంది భారతీయులు అమెరికాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా వేలాది మందిని అక్రమ వలసదారులుగా పరిగణించి వెనక్కి పంపించేస్తున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ షురూ అయ్యింది. అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించి అధికారులు ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్ కు బయలుదేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించినట్లు వార్తా ఏజెన్సీ రాయిటర్స్ సంస్థ పేర్కొంది. సీ 17 ఎయిర్ క్రాఫ్ట్ లో వలసదారులను తరలిస్తున్నట్లు సమాచారం. భారత్ కు చేరుకునేందుకు 24 గంటల సమయం పడుతుందని అంచనా. అయితే ఎంత మంది వలసదారులను తరలిస్తున్నారన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ట్రంప్ మొదటి నుంచి కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ బాధ్యత...

అక్కడ కుంబ మేళ ... ఇక్కడ కొబ్బరి కాయలు గిరాకీ ... ఇంతకు ఏమయింది ?

 అక్కడ కుంబ మేళ ... ఇక్కడ కొబ్బరి కాయలు గిరాకీ ... ఇంతకు ఏమయింది ?అక్కడ కుంబ మేళ ... ఇక్కడ కొబ్బరి కాయలు గిరాకీ ... ఇంతకు ఏమయింది ? కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించి, నదికి కురిడి కొబ్బరి సమర్పించడం సాంప్రదాయం. దీనితో కుంభమేళాకి కోనసీమ నుంచి కురిడి కొబ్బరి ఎగుమతులు భారీగా పెరిగాయి. దాదాపు రెండు లక్షలు కురిడి కొబ్బరికాయలు ఈ ప్రాంతం నుంచి తరలిస్తున్నారు. ధర కూడా గతంలో ఎప్పుడు లేనివిధంగా భారీగా పెరిగింది. ఒక్కొక్క కురిడి కొబ్బరికాయ 20 నుంచి 25 రూపాయల వరకు పలుకుతుంది. కొబ్బరి రైతుల చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు .కోనసీమ పరిసర ప్రాంతాల నుంచి 100 కొబ్బరికాయలు బయటకు వెళ్తుంటే అందులో వాటర్ కోకోనట్స్ 20 మాత్రమే ఉంటున్నాయి. మిగతా 80 కూడా కురిడి కొబ్బరి ఉంటున్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా కొబ్బరి దిగుబడి ఈ ఏడాది తగ్గడం కోనసీమ రైతులకు కలిసొచ్చింది. దానివలన అనూహ్యమైన ధర పలుకుతుంది. కురిడీలో గండేర రకానికి డిమాండ్ మరింత ఎక్కువ ఉందని రైతులు చెప్తున్నారు. కురిడీకి వచ్చిన అనూహ్యమైన ధరతో రైతులు, వ్యాపారులు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్లు, కూలీలకు చేతినిండా పని దొరుకుతుంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఇదే పరిస్థితి...

కాకినాడ మత్స్యకారులు వలలో కచిడి చేప @ ₹3.95 లక్షలు: కుట్లు, సౌందర్య సాధనాల్లో ఉపయోగం

 కచిడి చేప: కాకినాడలో అదృష్టం పండిన వేళ! కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు అదృష్టం వరించింది. వేటకు వెళ్లిన వారికి అరుదైన కచిడి చేప లభించడంతో ఒక్కసారిగా వారి జీవితాలు మారిపోయాయి. ఈ చేప వేలంలో భారీ ధరకు అమ్ముడుపోవడంతో వారు కాసుల పంట పండించారు. ఇంతకీ ఈ కచిడి చేప ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కచిడి చేప - ఓ అద్భుత సంపద: ఈ చేప పేరు కచిడి చేప, దీని శాస్త్రీయ నామం ప్రోటోనిబియా డయాకాన్తస్ (Protonibea diacanthus). ఇది చాలా అరుదుగా దొరికే చేప. ఈ చేపకు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా భారీ డిమాండ్ ఉంది. కాకినాడలో దొరికిన ఈ చేప 25 కిలోల బరువుంది. దీనిని వేలం వేయగా రికార్డు స్థాయిలో రూ. 3.95 లక్షలు పలికింది. అంటే కిలో చేప దాదాపు రూ. 15,800లకు అమ్ముడుపోయింది. కచిడి చేప ఉపయోగాలు: ఈ చేప కేవలం రుచికి మాత్రమే కాదు, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కుట్లు వేయడానికి దారం: ఈ చేప పొట్ట భాగం నుండి తీసిన పదార్థాన్ని కుట్లు వేయడానికి అవసరమైన దారాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సౌందర్య సాధనాలు: ఈ చేపను సౌందర్య సాధనాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. వైన్ శుభ్రం చేయడానికి: ఖరీదైన వైన్ లను శుభ్రం చేయడానికి ఈ చేప ...

77 ఏళ్ల తర్వాత నీలబందలో విద్యుత్ వెలుగులు : ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రామం ఉంది మీకు తెలుసా!

 అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం, అర్ల పంచాయతీలోని నీలబంద గ్రామంలో విద్యుత్ వెలుగులు లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు అయినా, ఈ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేదు. దీంతో ప్రజలు చీకట్లోనే జీవనం సాగించారు. ఎట్టకేలకు, నీలబంద గ్రామంలో విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గ్రామంలో మొదటిసారిగా విద్యుత్ వెలుగులు రావడంతో ప్రజలు ఎంతో సంతోషించారు. ఈ ఆనంద క్షణాల్లో, గ్రామస్తులు థింసా నృత్యం చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నీలబంద గ్రామంలో 3 కుటుంబాలు మరియు 26 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం రావడం నిజంగా గొప్ప విషయం.

సెలైన్‌తో చికిత్స పొందుతూ, రోగులకు చికిత్స అందించిన డాక్టర్!

Image
 డాక్టర్ బ్రజరాజ్ కర్ చేతికి సెలైన్ పెట్టించుకుని రోగులకు చికిత్స అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆయన సేవాభావాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. తమ ఆరోగ్యం బాగోలేకపోయినా, ఇతరుల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం నిజంగా ఒక గొప్ప గుణం. ఆయన నిర్విరామ సేవను చూసి చాలా మంది ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.