సముద్రం లో షార్క్ లు మధ్యన హోటల్ ..ఎక్కడ ఉందొ తెలుసా ?

 

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్

ప్రపంచంలో ఎన్నో అందమైన హోటల్స్తో పాటు అత్యంత ప్రమాదకరమైన హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ అంత ప్రమాదకరమైన హోటల్ ఎక్కడ ఉంది? అసలు ఎందుకు ఈ హోటల్ ప్రమాదకరంగా మారింది? పూర్తి వివరాలు ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.


నార్త్ కరోలినా తీరానికి 34 మైళ్ల దూరంలో ఫ్రైయింగ్ పాన్ టవర్ అనే ఓ హోటల్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్. అయితే ఈ హోటల్కి చేరుకోవాలంటే పడవలో వెళ్లడానికి కూడా అవకాశం లేదు. కేవలం విమానంలో మాత్రమే ఈ హోటల్కి చేరుకోవాలి. బీచ్ మధ్యలో ఉండే ఈ హోటల్ ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. ఎంతో అందంగా ఉండే ఈ ప్లేస్లో చాలా తినడానికి వెళ్తుంటారు. కానీ కాస్త భయంతోనే ఉంటారు. ఎందుకంటే సముద్రంలో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే మాత్రం ఇక పైకే. ఇక్కడ ఎన్నో ప్రమాదకరమైన జీవులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సొరచేపలు అధికంగా ఉన్నాయి. ఈ ఫ్రైయింగ్ పాన్ టవర్ అనేది ఒకప్పుడు కోస్ట్ గార్డ్ లైట్ స్టేషన్గా పనిచేసింది. అయితే ఇప్పుడు ఇది హోటల్గా మారింది. ఇక్కడికి ఎక్కువగా సాహస ప్రియులు వెళ్తుంటారు. ఈ టవర్లో ఉంటే మాత్రమే సముద్ర అందాలను వీక్షించవచ్చు. ఎంతో సుందరంగా ఉంటాయి. ఈ టవర్లో కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటుంది.


ఈ ఫ్రైయింగ్ పాన్ టవర్ దగ్గరికి ఎక్కువగా సాహస ప్రియులు వెళ్తుంటారు. ఈ టవర్ పైకప్పుపై హెలిప్యాడ్, వాటర్ఫాయిల్ కెమెరాతో కూడిన సెటప్ కూడా ఉంటుంది. అందులో జరిగిన అన్ని విషయాలు కూడా ఆ సీసీటీవీ ఫుటేజీలో చూడవచ్చు. అయితే రిచర్డ్ నీల్ 2010లో కోస్ట్ గార్డ్ లైట్ స్టేషన్ నుంచి టవర్ను హోటల్గా మార్చాడు. అప్పటి నుంచి అడ్వెంచర్ ప్రియులకు హాట్ స్పాట్గా మారింది. ఎక్కువ మందికి ఇక్కడికి వెళ్తుంటారు. ఈ హోటల్లో ఒక రోజు ఎవరైనా ఉండాలంటే దాదాపుగా రూ.42,268 ఖర్చు అవుతుంది. అయితే ఇందులో ఒక రోజు కంటే మూడు రోజుల ట్రిప్ నుంచి ప్రారంభమవుతుంది. మీకు నచ్చిన ప్యాకేజీలో వెళ్లవచ్చు.




Comments

Popular posts from this blog

కాలువలో భారీ కొండచిలువ: ప్రాణాలకు తెగించి లాగేసిన యువకుడు

కాకినాడ మత్స్యకారులు వలలో కచిడి చేప @ ₹3.95 లక్షలు: కుట్లు, సౌందర్య సాధనాల్లో ఉపయోగం

77 ఏళ్ల తర్వాత నీలబందలో విద్యుత్ వెలుగులు : ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రామం ఉంది మీకు తెలుసా!