సముద్రం లో షార్క్ లు మధ్యన హోటల్ ..ఎక్కడ ఉందొ తెలుసా ?

Image
  ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్ ప్రపంచంలో ఎన్నో అందమైన హోటల్స్తో పాటు అత్యంత ప్రమాదకరమైన హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ అంత ప్రమాదకరమైన హోటల్ ఎక్కడ ఉంది? అసలు ఎందుకు ఈ హోటల్ ప్రమాదకరంగా మారింది? పూర్తి వివరాలు ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం. నార్త్ కరోలినా తీరానికి 34 మైళ్ల దూరంలో ఫ్రైయింగ్ పాన్ టవర్ అనే ఓ హోటల్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్. అయితే ఈ హోటల్కి చేరుకోవాలంటే పడవలో వెళ్లడానికి కూడా అవకాశం లేదు. కేవలం విమానంలో మాత్రమే ఈ హోటల్కి చేరుకోవాలి. బీచ్ మధ్యలో ఉండే ఈ హోటల్ ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. ఎంతో అందంగా ఉండే ఈ ప్లేస్లో చాలా తినడానికి వెళ్తుంటారు. కానీ కాస్త భయంతోనే ఉంటారు. ఎందుకంటే సముద్రంలో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే మాత్రం ఇక పైకే. ఇక్కడ ఎన్నో ప్రమాదకరమైన జీవులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సొరచేపలు అధికంగా ఉన్నాయి. ఈ ఫ్రైయింగ్ పాన్ టవర్ అనేది ఒకప్పుడు కోస్ట్ గార్డ్ లైట్ స్టేషన్గా పనిచేసింది. అయితే ఇప్పుడు ఇది హోటల్గా మారింది. ఇక్కడికి ఎక్కువగా సాహస ప్రియులు వెళ్తుంటారు. ఈ టవర్లో ఉంటే మాత్రమే సముద్ర అందాలను వీక్షించవచ్చు. ఎంతో సుందరంగా ఉం...

అక్కడ కుంబ మేళ ... ఇక్కడ కొబ్బరి కాయలు గిరాకీ ... ఇంతకు ఏమయింది ?

 అక్కడ కుంబ మేళ ... ఇక్కడ కొబ్బరి కాయలు గిరాకీ ... ఇంతకు ఏమయింది ?అక్కడ కుంబ మేళ ... ఇక్కడ కొబ్బరి కాయలు గిరాకీ ... ఇంతకు ఏమయింది ?


కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించి, నదికి కురిడి కొబ్బరి సమర్పించడం సాంప్రదాయం. దీనితో కుంభమేళాకి కోనసీమ నుంచి కురిడి కొబ్బరి ఎగుమతులు భారీగా పెరిగాయి. దాదాపు రెండు లక్షలు కురిడి కొబ్బరికాయలు ఈ ప్రాంతం నుంచి తరలిస్తున్నారు. ధర కూడా గతంలో ఎప్పుడు లేనివిధంగా భారీగా పెరిగింది. ఒక్కొక్క కురిడి కొబ్బరికాయ 20 నుంచి 25 రూపాయల వరకు పలుకుతుంది. కొబ్బరి రైతుల చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు .కోనసీమ పరిసర ప్రాంతాల నుంచి 100 కొబ్బరికాయలు బయటకు వెళ్తుంటే అందులో వాటర్ కోకోనట్స్ 20 మాత్రమే ఉంటున్నాయి. మిగతా 80 కూడా కురిడి కొబ్బరి ఉంటున్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా కొబ్బరి దిగుబడి ఈ ఏడాది తగ్గడం కోనసీమ రైతులకు కలిసొచ్చింది. దానివలన అనూహ్యమైన ధర పలుకుతుంది. కురిడీలో గండేర రకానికి డిమాండ్ మరింత ఎక్కువ ఉందని రైతులు చెప్తున్నారు. కురిడీకి వచ్చిన అనూహ్యమైన ధరతో రైతులు, వ్యాపారులు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్లు, కూలీలకు చేతినిండా పని దొరుకుతుంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఈసారి కొబ్బరి రైతులకు అధిక లాభాలు వస్తాయి. కురిడీకి ఉన్న డిమాండ్ తో ధరలు మరింత పెరుగుతాయని రైతులు అనుకుంటున్నారు. గతంలో కురిడిని ఆయుర్వేదం మందులు తయారీకి, వంటలలో మాత్రమే వినియోగించేవారు. దాంతో ఇప్పటివరకు కురిడీని అంతంత మాత్రంగానే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. మొత్తానికి మహా కుంభమేళా కోనసీమ కొబ్బరికి కలిసొచ్చింది. కురిడీ కొబ్బరి ధరలు అంతంకంతకు పెరగడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.

Comments

Popular posts from this blog

కాలువలో భారీ కొండచిలువ: ప్రాణాలకు తెగించి లాగేసిన యువకుడు

కాకినాడ మత్స్యకారులు వలలో కచిడి చేప @ ₹3.95 లక్షలు: కుట్లు, సౌందర్య సాధనాల్లో ఉపయోగం

77 ఏళ్ల తర్వాత నీలబందలో విద్యుత్ వెలుగులు : ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రామం ఉంది మీకు తెలుసా!